మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15 షూటింగ్ దశలో ఉంది. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇదిలా ఉండగా…. రామ్ చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్ కు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అంటూ గతకొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే విషయంపై స్పందించారు రామ్ చరణ్. ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న రామ్ చరణ్ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అవి నిరాధారమైన రూమర్స్ అని కొట్టిపారేశారు. ఈ 100 కోట్లు ఎక్కడివి, నాకు ఎవరు ఇస్తున్నారని తిరిగి ప్రశ్నించారు.