దగ్గుబాటి రానా హీరోగా ప్రభు సాల్మన్ డైరెక్షన్‌లో తెరక్కిన క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ అరణ్య. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడింది. ఫైనల్లీ ఈ నెల 26న విడుదలకు మూవీ మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌కి సంబంధించిన అప్డేట్స్ అందించారు. రెండు రోజులలో అరణ్య ట్రైలర్ మిమ్మల్ని అలరించేందుకు రాబోతుందంటూ రానా తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా తెలిపారు.
25 ఏళ్లుగా అరణ్యంలో జీవించే వ్యక్తి.. కార్పొరేట్ సంస్థల కుట్రలపై పోరాడే కథాంశంతో అరణ్య తెరకెక్కినట్టుగా ఇప్పటికే సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది. పర్యావరణం సమస్యలు, అటవీ నిర్మూలనతో కలిగే ఉపద్రవాలను ఉద్దేశిస్తూ సందేశాత్మకంగా ఉంటుందని అంటున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఎంతో ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. మూడు భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ కానుంది.