రానా బర్త్ డే దావత్ గా ఆయన నటించిన రెండు సినిమాల నుంచి ప్రత్యేక వీడియోలు విడుదలయ్యాయి. ముందుగా విరాటపర్వం మూవీ నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ది వాయిస్ ఆఫ్ రవన్న పేరుతో ఉన్న ఈ వీడియోలో రానా లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మావోయిస్టు కథ నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాలో రానా సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ శేఖర్ టీజర్ ని రిలీజ్ చేశారు. థమన్ మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రానా అగ్రెసివ్ డైలాగ్ కలగలిపి వచ్చిన ఈ గ్లింప్స్ అదిరింది అంటూ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.
Advertisements