టాలీవుడ్ లో యంగ్ హీరోలంతా వరుస పెట్టి పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్ మ్యారేజ్ ఫిక్స్ అయి కరోనా వల్ల వాయిదా పడగా… మరో టాలీవుడ్ యంగ్ హీరో ప్రేమ పెళ్లికి రెడీ అవుతున్నాడు.
ఇన్నాళ్లు తను ప్రేమించిన అమ్మాయిని బయటకు చెప్పని దగ్గుబాటి రానా తాజాగా సోషల్ మీడియా వేదికగా అసలు విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అండ్ షి సెయిడ్ ఎస్ అంటూ కాప్షన్ తో మిహిక బజాజ్ తో ఉన్న ఫోటో షేర్ చేశాడు.
దీంతో రానా అభిమానులు, వెల్ విషర్స్ అంతా అభినందనలు తెలుపుతున్నారు.
And she said Yes 🙂 ❤️ pic.twitter.com/iu1GZxhTeN
— Rana Daggubati (@RanaDaggubati) May 12, 2020
అయితే, మిహిక బజాజ్ సినిమాలతో పెద్దగా టచ్ లేదు. తను క్లాత్ లైన్ లో డ్యూ డ్రాప్ అనే స్డూడియోస్ ను ఏర్పాటు చేసి, ఆ వ్యవహరాలు చూసుకుంటుందని తెలుస్తోంది.