మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న రానా ఒక్కసారిగా తన ఫియాన్‌సే పేరు, ఫోటో సోషల్ మీడియాలో పెట్టి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. హీరోయిన్ అనుష్క శెట్టి, త్రిషలతో రానా డేటింగ్ చేస్తున్నాడంటూ అనేక వార్తలు షికారు చేశాయి. ఇటీవలే రానాతో వీడియో కాల్ అంటూ త్రిష ఓ స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేసింది.
కానీ సడన్ గా మిహిక బజాజ్ తో తన కొత్త జీవితం అని ప్రకటించాడు రానా. ఇంతకీ ఈమె ఎవరు…? ఆమె తల్లితండ్రులు ఎవరు…? ఏం చేస్తుంటారు…? అన్న సందేహాం రానా అభిమానులను వెంటాడుతూనే ఉంది.
మిహిక బజాజ్ తల్లితండ్రులు హైదరాబాద్ వారే అయినప్పటికీ వారు ముంబై షిఫ్ట్ అయ్యారు. జ్యూవెలరీ బిజినెస్ చేస్తుంటారు. మిహికకు ఈవెంట్స్ మేనేజ్మెంట్ లో మంచి పట్టుందని తెలుస్తోంది. ఆమె డ్యూ డ్రాప్ స్టూడియో కూడా నిర్వహిస్తోంది. ఓవైపు ప్యాషన్ రంగంతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది. ముంబాయి నుండి గ్రాడ్యుయేట్ అయిన మిహిక ఆర్ట్ అండ్ డిజైన్ లో లండన్ యూనివర్సిటి నుండి మాస్టర్స్ చేసిందట.
ఇటు రానా కుటుంబం, అటు మిహిక కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోవటంతో అధికారికంగా రానా పోస్ట్ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.