బాహుబలి రానాకు ఏమయ్యింది.? ఎందుకు రోజురోజుకీ అతను అలా చిక్కిపోతున్నాడు..? మంచి దృఢకాయంతో ఆజానబాహువుగా, ఉక్కు మనిషిగా వుండే రానా తాజా ఫోటోగ్రాఫ్‌లో ఎలా వున్నాడో చూశారా?

హైదరాబాద్ : యంగ్ హీరో రానా ప్రస్తుతం అమెరికాలో వైద్య చికిత్స చేయించుకుంటున్నాడు. అతను కిడ్నీ సంబంధిత చికిత్స తీసుకుంటున్నాడని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. దగ్గుబాటి కుటుంబం దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ, రానా అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాడనేది నిజం. దీనిపై మీడియాలో కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రానా అందుబాటులో లేని కారణంగానే అతను ఒప్పుకున్న అనేక ప్రాజెక్టుల తాలూకు షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.
తాజాగా రానా ఓ బ్రాండ్ ప్రమోషన్ నిమిత్తం తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. ఈ ఫోటో చూసినవారందరూ షాక్ అయ్యారు. మంచి దిట్టంగా వుండే రానా ఇలా సన్నగా అయిపోవడంతో ఫాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. చికిత్స కారణంగానే రానా ఇలా చిక్కిపోయాడని తెలుస్తోంది. ఇలావంటే అతనికి జరిగిన చికిత్స విజయవంతం అయ్యిందని, త్వరలోనే ఇక్కడికి వచ్చి షూటింగ్‌లలో పాల్గొనడానికి రానా సిద్ధమవుతున్నాడని లేటెస్ట్ టాక్.