దేశ సరిహద్దులో పౌరుల ప్రాణాలను, దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ… ఇంటికి దూరంగా, 24గంటల పాటు డ్యూటీలో ఉంటూ వీర సైనికులు పడుతున్న కష్టాన్ని మిషన్ ఫ్రంట్ లైన్ పేరుతో రానా దగ్గుబాటి డాక్యుమెంటరీ చేస్తున్నారు.
ఒక్క హాలీడే ఉండదు, బ్రేక్ ఉండదు, రెస్ట్ తీసుకునే టైం ఉండదు… అన్నిటికి మించి ఎముకలు గడ్డ కట్టే చలిలో దేశాన్ని కాపాడాల్సిన బరువు మోస్తున్నారు మన సైనికులు. అలాంటి వారితో కొన్ని రోజులు గడిపి, వారి జీవితాన్ని చూసి, వారి కష్టసుఖాలను ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నానంటూ రానా ప్రకటించారు.
జైసల్మేర్ లోని సరిహద్దు ప్రాంతంలో సైనికులతో పాటు ఉంటూ, వారి తిన్నదే తింటూ… వారితోనే ట్రైనింగ్ చేస్తూ… రానా ఈ డాక్యుమెంటరీ రూపోందిస్తున్నారు. మురార్ పోస్టులో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో గన్ ట్రైనింగ్ తో పాటు మంచు కొండల్లో సైనికులు చేసే అన్ని యుద్ధ సన్నాహకాల్లో రానా భాగం అవుతున్నట్లు తెలుస్తోంది.
జనవరి 26, గణతంత్రదినోత్సవం రోజున ఈ డాక్యుమెంటరీ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.