అన్ని భాషల్లో సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లో ఉన్న హీరో రానా దగ్గుబాటి. ప్రస్తుతం విరాట పర్వం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ హీరో, త్వరలో పవన్ కళ్యాణ్ తో కలిసి అయ్యపురం కోష్యిం రీమేక్ మూవీలో నటించనున్నారు. ఇక ఎప్పటి నుండో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు వెయిట్ చేస్తున్న వెంకీ-రానా మల్టిస్టారర్ కు కూడా సరైన కథ దొరికిందని సురేష్ బాబు స్వయంగా ప్రకటించారు.
తాజాగా మరో మల్టిస్టారర్ కు రానా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్, రానా కలిసి ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను కూడా సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించనుంది. 2021మార్చి తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. త్వరలో పూర్తిస్థాయి అధికారిక డీటైల్స్ వెలువడనున్నాయి.
ఈ సినిమాతో రానా వచ్చే ఏడాదంతా బిజీబిజీగా గడపనున్నారు.