అందరూ భావించినట్టు గానే భీమ్లా నాయక్ సినిమాలో రానాకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రయూనిట్ అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 20న ఈ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేర ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో పంచె కట్టు లో కనిపించారు రానా.
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో రాణా కనిపించబోతున్నాడు. అలాగే భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే పవన్ కు సంబంధించిన వీడియో అలాగే ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Get ready to experience the #BLITZofDANIELSHEKAR, @RanaDaggubati from 20th Sept💥#BheemlaNayak @pawankalyan #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/2BYtBOzLEK
— Sithara Entertainments (@SitharaEnts) September 17, 2021
Advertisements