ఇప్పటికే వకీల్ సాబ్ రీమేక్ మూవీ చేస్తున్న పవన్ కళ్యాణ్… త్వరలో అయ్యపురం కోష్యిం రీమేక్ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్, మాటలను డైరెక్టర్ త్రివిక్రమ్ పర్యవేక్షిస్తుండగా, సాగర్ చంద్ర దర్శకత్వం వహించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఈ మూవీలో పవన్ తో పాటు ఫుల్ లెంగ్త్ ఉండే క్యారెక్టర్ కోసం అనేక పేర్లు తెరపైకి రాగా… ఫైనల్ గా భల్లాల దేవుడు రానా దగ్గుబాటి వైపే మొగ్గుచూపారు. ఇదే అంశాన్ని హారిక హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేసింది. థమన్ మ్యూజిక్ అందించనున్నాడు.