రానా దగ్గుబాటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా హిరణ్యకశ్యప. కరోనా వైరస్ కారణంగా 2021కి వాయిదా పడ్డ ఈ మూవీ షూటింగ్ మరింత లేట్ కానుంది.
వందల మంది సిబ్బంది పని చేయాల్సిన అవసరం ఉండటం, భారీ బడ్జెట్ సినిమా కావటంతో రానా రిస్క్ చేయాలనుకోవడం లేదు. ఈ గ్యాప్ లోపు తన చేతిలో ఉన్న విరాట పర్వం పూర్తి చేసి, సురేష్ ప్రొడక్షన్స్ కోసం సినిమా కథలు వింటున్నారు. ఇక వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాడు.
2022లో హిరణ్యకశ్యప షూట్ మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ లోపు డైరెక్టర్ గుణ శేఖర్ మరో మూవీ పూర్తి చేయనున్నారు.