గురువారం రానా తన ట్విట్టర్ లో ….తన ఫోటోతో పోటు తనకు కాబోయే శ్రీమతి ఫోటో ను పెడుతూ “And it’s official!!” అని పోస్ట్ చేశాడు. దీంతో రానా, మిహీకాల నిశ్చితార్థం అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ అందరూ అనుకుంటున్నట్లు నిన్న రామానాయుడు స్టూడియోలో జరిగింది నిశ్చితార్థం కాదు, రోకా వేడుక !
ఉత్తర భారతదేశ సాంప్రదాయం ప్రకారం..పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో ఇదొకటన్నమాట.! దాదాపు మనదగ్గరి నిశ్చితార్థంలాంటిదే ఇది. సాధారణంగా ఈ వేడుక వరుడి ఇంట్లో నిర్వహిస్తారు. వధువు కుటుంబ సభ్యులు వచ్చి…. వరుడుని ఖాయం చేసుకుంటారు. ఈ సందర్భంగా వరుడి తల్లి వధువు తలపై ఎర్రటి దుప్పట్టాను కప్పి, నుదుటిపై బొట్టు పెడుతుంది. . అమ్మాయి తరపు వారు అబ్బాయికి గంధం పూసి, బట్టలు పెడతారు. ఆ తర్వాత ఇరుకుటుంబ సభ్యలు స్వీట్స్, డ్రైప్రూట్స్, గిఫ్ట్స్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. మిహికాది నార్త్ ఇండియా కాబట్టి…ఈ కార్యక్రమం వారి సాంప్రదాయం ప్రకారం జరిగింది.