నెట్ ఫ్లిక్స్ లో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ రానా నాయుడు. దీనికి కారణం వెంకటేష్, రానా కలిసి నటించడమే. ఎట్టకేలకు ఆరోజు రానే వచ్చింది. తాజాగా రానా నాయుడు ట్రైలర్ రిలీజైంది.
ట్రైలర్ లో విషయం ఏంటనేది క్లియర్ గా చెప్పేశారు. సిరీస్ లో వెంకీ-రానా తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. ఇద్దరికీ పడదు. కొడుకు పోలీసాఫీసర్, తండ్రి ఓ క్రిమినల్. కానీ, ఇద్దరి ఆశయం ఒకటే.
పగతో రగిలిపోతుంటాడు వెంకీ. జైలు నుంచి ఇలా బయటకొచ్చి అలా హత్యలు స్టార్ట్ చేస్తాడు. వాటిని రానా ఆపలేకపోతాడు. ఇలా సాగుతుంది ఈ సిరీస్ వ్యవహారం.
ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు, వినిపించిన డైలాగ్స్ బాగున్నాయి. ఓటీటీకి తగ్గట్టు కొన్ని బోల్డ్ డైలాగ్స్ పెట్టారు. బూతులు కూడా సిరీస్ లో దండిగా ఉన్నట్టు తెలుస్తోంది.
మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది రానానాయుడు సిరీస్. ఇందులో రానా రొటీన్ గానే కనిపించినప్పటికీ, వెంకీ మాత్రం కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు.