దగ్గుబాటి రానా. పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలితో తన క్రేజ్ అమాంతం పెంచుకున్న రానా ఈ మధ్య కాస్త హెల్త్ ఇష్యూస్‌తో వార్తల్లో నిలిచాడు.
రానా ప్రస్తుతం విరాట పర్వం అనే సినిమాలో నటిస్తున్నారు. రానాతో పాటు సాయి పల్లవి, టబులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వేణు అడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలంగా ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతోంది ఈ సినిమా షూటింగ్. వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉందట చిత్ర యూనిట్.
అయితే, రానా అనగానే రానా కటౌట్‌తో పాటు ఆయన గడ్డం కూడా గుర్తుకొస్తుంది. చాలా కాలంగా బియర్డ్ లుక్‌ను మెయింటెన్ చేస్తూ వస్తున్నారు రానా. కానీ విరాటపర్వం సినిమాలో క్లీన్ షేవ్‌తో సన్నివేశాలు తీయబోతున్నారట. అందుకే త్వరలోనే తాను ఎంతో ఇష్టపడే బియర్డ్ లుక్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారట రానా.