రానా-మిహిక‌లు ఎలా క‌లిశారో తెలుసా... - Tolivelugu

రానా-మిహిక‌లు ఎలా క‌లిశారో తెలుసా…

టాలీవుడ్ యంగ్ హీరో రానా ద‌గ్గుబాటి, మిహిక‌ల పెళ్లికి స‌ర్వం సిద్ధ‌మ‌యిపోయింది. ఇప్ప‌టికే ఎంగెజ్మెంట్ కూడా పూర్త‌యింది. జ్యూవెల‌రీ బిజినెస్ చేసే కుటుంబానికి చెందిన మిహిక బ‌జాజ్ పేరుకు హైద‌రాబాదీయే కానీ తెలుగులో పెద్ద‌గా ప‌ర్ ఫెక్ట్ కాద‌ని తెలుస్తోంది.

అయితే… రానా-మిహిక‌లు ఒక‌రికొక‌రికి ఎలా తెలుసు అన్న దానిపై రానా క్లారిటీ ఇచ్చారు. రానా బాబాయ్, హీరో వెంక‌టేష్ పెద్ద కూతురు అశ్రిత క్లాస్ మెట్ మిహిక‌. అలా అశ్రిత‌తో రానాకు మిహిక చాలా కాలంగా ప‌రిచ‌యం. లాక్ డౌన్ కు కొద్ది రోజుల ముందు రానానే స్వ‌యంగా మిహిక‌కు పెళ్లి విష‌యం చెప్ప‌టం, మిహిక కూడా ఒప్పుకోవటంతో విష‌యం ఇంట్లో పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌. ఇటు సురేష్ బాబు దంప‌తులు, అటు మిహిక పేరెంట్స్ కూడా ఒప్పుకోవ‌టంతో త‌మ ఆనందానికి అవ‌ద‌లు లేవంటూ రానా ప్ర‌క‌టించాడు. పైగా ఇదంతా కేవ‌లం ఒక్క రోజులోనే జ‌రిగిపోయింద‌ని స్వ‌యంగా తెలిపాడు.

Share on facebook
Share on twitter
Share on whatsapp