దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తెరకెక్కింది. మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్స్ ఆఫీసు కలెక్షన్లను షేక్ చేస్తూ రికార్డులను కొల్లగొడుతోంది. తాజాగా అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ 3వ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళిపై టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘వన్ ఇండియా వన్ సినిమా అనేది ఒక వ్యక్తి వచ్చి, ఇది ఇలా ఉంటుంది అని చెప్పే వరకు ఒక కోరిక, కలగా ఉండేది..! కెప్టెన్ మీరు దీన్ని మళ్లీ చేసారు..! రాజమౌళి అండ్ టీంకి మీకు సెల్యూట్’ అంటూ రానా ట్వీట్ చేశారు. అలాగే, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయిన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. 16 రోజుల వ్యవధిలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తక్కువ వ్యవధిలో ఈ ఘనతను సాధించిన సినిమాగా చరిత్రను సృష్టించింది.ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో రూ. 1000 కోట్లు వసూళ్లు చేసిన తొలి భారతీయ సినిమాగా ‘దంగల్’, రెండో చిత్రంగా ‘బాహుబలి 2’ ఉన్నాయి. .
కాగా అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. తెలుగు-భాషా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయిన ఈ ఫిల్మ్‌ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య నిర్మించారు.
“ONE INDIA ONE CINEMA” was a wishful dream till one man came along and said this is what it looks like!! Capitan you’ve done it again!!🔥🔥🔥🔥 @ssrajamouli and team #RRR. I salute you!! @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/JGR1zOsDLP
— Rana Daggubati (@RanaDaggubati) April 10, 2022