సర్వీస్ బాగోక పోయినా సమాధానం కరెక్టుగా ఉంటే సరిపెట్టుకుంటాం. రెండూ బాగోకపోతే తిట్టుకుంటాం. వాళ్ళ వ్యవహారం మితిమీరితే గొడవపెట్టుకుంటాం.ఇవేవీ కుదరనప్పుడు సైలెంటుగా వచ్చేసి సామాజిక మాధ్యమంలో నలుగురికీ తెలిసేలా నాలుగుపోస్టులుపెట్టి ఫ్రష్ట్రేషన్ ఫ్రీ అయిపోయి. తీరిగ్గా లైకులూ కామెంట్లు చెక్ చేసుకుంటూ చియరప్ అవుతాం. ఇదంతా ఏంటనుకుంటున్నారా..! మన స్టార్ హీరో రానా దగ్గుబాటికి ఎదురైన చేదు అనుభవం.
ఈ రోజు ఉదయం కుటుంబంతో కలిసి హైదరాబ్ నుంచి బెంగుళూరు వెళ్ళేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. షెడ్యూల్ట్ ఫ్లైట్ కాకుండా మరో విమానంలో వెళ్ళాలని సిబ్బంది ఇబ్బంది పడుతూ సూచించారు. అంతవరకూ బాగానే ఉంది.లగేజ్ కూడా అదే విమానంలో వస్తుందన్నారు ఇదీ బాగానే ఉంది. వాళ్ళు చెప్పినట్టే రానా కుటుంబం బెంగుళూరు ప్రయాణమయ్యింది.లగేజ్ మాత్రం రాలేదు. రానాకు చిర్రెత్తుకొచ్చింది. ఇదేంటని అడిగితే సిబ్బంది సైతం చిరాకు తెప్పించేలా సమాధానం చెప్పారు.
దీంతో ట్విట్టర్ ఓపెన్ చేసాడు. ఇండిగో ఎయిర్ లైన్సంత చెత్త సర్వీస్ మరోటి ఉండదన్నంతగా తూటాల్లాంటి ట్వీట్లు సంధించాడు. మిస్సైన లగేజిని ఎలా తెలుసుకోవాలో సిబ్బందికే తెలీదని సెటైర్లేసాడు. ఇంగిగో ఎయిర్ లైన్ యాడ్స్ మీద కూడా విరిచుకుపడ్డాడు. విషయం తెలుసుకున్న రానా ఫాలోవర్స్ అవునా ! అలానా !? చూస్తావేం !ఇండిగో మీద రెచ్చిపో రానా! అంటూ బళ్ళాల దేవుడికి తమవంతు కామెంట్ల భరోసా ఇచ్చారు.