టాలీవుడ్ భల్లాలదేవుడు ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు బ్యాచ్లర్ గా ఉన్న రానా తన ప్రేయసి గురించి సోషల్ మీడియా వేదికగా బయపెట్టేశాడు. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నట్టు తెలిపాడు. ఇటీవల ఇరువురు కుటుంబ సభ్యులు కూడా కలుసుకున్నారట. త్వరలోనే ముహూర్తం కుదిరాక వివరాలను ప్రకటిస్తారని సమాచారం.
అయితే మిహిక అప్పుడే తమ బంధానికి గట్టిగా ముడివేసింది. రానా పేరులోని మొదటి అక్షరం Rను, తన పేరులోని తొలి అక్షరమైన M ను లవ్ సింబల్ తో టాటూ వేయించుకుంది. ప్రస్తుతం ఈ టాటూ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.