బాలీవుడ్ ప్రేమ జంట అలియా భట్-రణబీర్ కపూర్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఎన్నో వాయిదాల తర్వాత వీరి వివాహం మరికొన్ని గంటల్లో జరగబోతోంది. అయితే, వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వానం మాత్రం బయటకు రాలేదు. ఇంత వరకు అధికారికంగా ఎక్కడా కూడా పెళ్లి గురించి గానీ ముహూర్తం గురించి గానీ ప్రకటించలేదు.
కేవలం అతికొద్ది మంది అతిథులతో కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ ఇద్దరి పెళ్లి జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైలోని రణ్‌బీర్ నివాసం ‘వాస్తు’లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ, సంగీత్ ఈవెంట్ ఘనంగా జరిగాయి. దీనికి బాలీవుడ్ బ్యూటీస్ కరీష్మా కపూర్, కరీనా కపూర్ సహా ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
కాగా, ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వకుండా ఉండేందుకు వీరు కుటుంబసభ్యులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అందుకే ఎవరి ఫోటోలు బయటకు రావట్లేదు. అయితే, 43 ఏళ్ల క్రితం రణ్‌బీర్ తల్లిదండ్రులు నీతూ కపూర్, రిషి కపూర్‌ల నిశ్చితార్థం జరిగిన రోజునే వీరి మెహందీ వేడుక జరిగింది. ఈ సందర్భంగా తన నిశ్చితార్థం ఫోటోను నీతూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇక, రణ్‌బీర్-అలియా పెళ్లి కోసం అభిమానులతోపాటు సినీ వర్గాలు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరి కొన్ని గంట్లో వీరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతోన్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పెళ్లి నేపథ్యంలో అభిమానులు కూడా తమ స్టార్స్ కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా పంపుతున్నారు.
Advertisements