సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆలియా-రణబీర్ వివాహా ఫోటోలు, వారి పెండ్లికి సంబంధించిన వివరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి వివాహానికి సంబంధించిన వివరాలను షేర్ చేస్తూ అభిమానులు మురిసిపోతున్నారు.
పెండ్లిలో రణబీర్- ఆలియాలకు చాలా గిఫ్ట్ లు వచ్చాయి. అందులో రణబీర్ కు ఆయన అత్త సోనీ రజ్దాన్ (ఆలియా భట్ తల్లి) ఇచ్చిన గిఫ్ట్ కు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.
ఆలియా- రణబీర్ దంపతులకు వివాహం సందర్భంగా సోనీ రజ్దాన్ ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చారు. కూతురు ఆలియాకు ఆమె డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చింది. ఆ గిఫ్ట్ ను చూసి ఆలియా ఆనందంతో మురిసిపోయింది.
అల్లుడు రణబీర్ కు ఆమె ఖరీదైన రిస్ట్ వాచ్ ను గిఫ్ట్ ఇచ్చారు. ఆ వాచ్ విలువ సుమారు రూ.2.50 కోట్లకు పైనే ఉంటుందని రణబీర్ బంధువులు అనుకుంటున్నారు.