పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని సినీ ఇండస్ట్రీల మధ్య.. అలానే నటీనటుల మధ్య ఉన్న దూరం తగ్గిపోతోంది. అలాగే ఆడియన్స్ కూడా భాషాభిప్రాయాలు లేకుండా నార్త్, సౌత్ అని లేకుండా ఏ సినిమా అయినా సరే చూస్తున్నారు. మన సౌత్ సినిమాలు హిందీలో బ్లాక్ బస్టర్ అవుతున్నాయంటే దానికి కారణం అదే. అంతేకాదు ఒకప్పటిలా కాకుండా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి మనవాళ్లు బాలీవుడ్ కు వెళ్తున్నారు. అక్కడి వాళ్లు ఇక్కడికి వస్తున్నారు.
తాజాగా బ్రహ్మాస్త్ర టీమ్ తెలుగు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. సౌత్ లో ఈ సినిమా రిలీజ్ బాధ్యతలు రాజమౌళి తీసుకున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ వెళ్లింది టీమ్. ఈ ఈవెంట్ లో రణబీర్ తో పాటు అయాన్ ముఖర్జీ, రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రణబీర్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
సౌత్ సినిమాల్లో మీకు నచ్చిన ఒక విషయం గురించి చెప్పమని అడగ్గా.. సౌత్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని.. కమల్ హాసన్, రజనీ కాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ బాగా చేస్తారని తెలిపాడు. పవన్ కళ్యాణ్ స్వాగ్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. రామ్ చరణ్ తనకు ఫ్రెండ్ అని చెప్పారు. సౌత్ లో ఫేవరెట్ హీరో ఎవరని అడగగా.. డార్లింగ్ ప్రభాస్ అంటే ఇష్టమని తను మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు రణబీర్.
మూడు పార్ట్ లుగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొదటిది బ్రహ్మాస్త్ర.. శివ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమితాబ్ బచ్చన్ తో పాటు నాగార్జున కూడా కీలక పాత్ర పోషించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.