రంణ్ బీర్ కపూర్, శ్రద్ధా కపూర్లు హీరో,హీరోయిన్‌లుగా నటించిన చిత్రం‘తూ ఝూఠీ మై మక్కర్’. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 8న విడుదలై ఘన విజయం సాధించింది.
అయితే ఈ ప్రచారంలో భాగంగా ఓ టీవీషోలో పాల్గొన్న రణ్‌బీర్ తన కూతురు రాహ కపూర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.ఈ షోకి తన కజిన్ కరీనా కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
టాక్ షోలో రణ్‌బీర్ మాట్లాడుతూ రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘బొడ్డు తాడు తెంపిన వెంటనే నేను రాహని ఎత్తుకున్నాను. ఆ క్షణం నా జీవితంలో పెద్ద జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుంది.
ఆ సమయంలో ఆకాశంలో తెలియాడుతున్నట్లు అనిపించింది. తండ్రిగా ఈ దశని చాలా ఎంజాయ్ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. అలాగే.. రాహపై మీడియా అటెన్షన్ గురించి మాట్లాడుతూ.. ‘ఓ నటుడిగా నాపై ఎప్పుడూ మీడియా కన్ను ఉంటుంది. అది సహజం. కానీ ఆ ప్రభావం నా కూతురు రాహ మీద పడకూడదు అనుకుంటున్నా.
నీ కుమారుడు తైమూర్ చాలాసార్లు మీడియా కంట్లో పడ్డాడు. అతనికి చాలా పాపులారిటీ వచ్చేసింది. కానీ.. నా కూతురు రాహని మాత్రం మీడియాకి దూరంగా ఉంచాలని అనుకుంటున్నా’ అని కరీనాతో రణ్‌బీర్ తెలిపాడు.