ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న రణబీర్ కపూర్,అలియా భట్ తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. తనకి పెళ్లికి ముందే తండ్రి కావాలనేది తన మనసులో ఉండేదని, ఆ విషయం అలియాకు కూడా తెలుసని రణబీర్ తెలిపాడు.
నేను ముందు కుటుంబాన్ని ప్రారంభించాలనుకోవడానికి ముఖ్య కారణం నా వయసు కూడా ఒకటి. ఎందుకంటే మార్చి 15న అలియా భట్ కి 29 ఏళ్లు రాగా,సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ తన 40వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. తన వయస్సువల్ల పిల్లలు పెద్దవారు అయిన తరువాత వారితో ఆడుకునేంత ఫిట్‌గా నేను ఉండలేను అంటూ రణబీర్ పేర్కొన్నాడు.
షంషేరా సినిమా చిత్రీకరణ సమయంలో ఓ ఇంటర్వ్యూలో రణబీర్‌ను మీకు పిల్లలు ఎప్పుడూ కావాలని అడగగా.. రణబీర్ మాట్లాడుతూ పిల్లలు కావాలనుకుంటే 40 ఏళ్ల వయసులో కూడా కలుగుతారు. కానీ వారికి 20 వచ్చేసరికి నాకు 60 వస్తాయి… అంటే… నేను వారితో కనీసం ఏ ఆటను ఆడలేను, ఏ పని చేయలేను, కనీసం నా పిల్లలతో కలిసి ట్రెక్కింగ్ కూడా వెళ్లలేను.
షంషేరా దర్శకుడు కరణ్ మల్హోత్రా కూడా రణబీర్ తనకు త్వరలో పిల్లలు కావాలని రెండున్నరేళ్ల క్రితమే చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ…అతనికి తండ్రి కావాలనే ఉత్సాహం చాలా ఉంది. ఇప్పుడు రణబీర్ తండ్రి కాబోతున్నాడని తెలిసి చాలా సంతోషంగా ఉంది. అతనికి శుభాకాంక్షలు. ఇలాంటి సంభాషణే రణబీర్ పెళ్లికి ముందు కూడా జరిగిందని తెలిపారు.
Advertisements
ప్రస్తుతం హాలీవుడ్ లో హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా చిత్రీకరణ కోసం అలియా లండన్‌లో ఉన్నారు. అక్కడే ఆమె ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ప్రస్తుతం ఆమె ముంబైకి తిరిగి వచ్చారు. జులై 22న విడుదల కాబోతున్న షంషేరా కోసం రణబీర్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.