తెలుగు నుంచి చాలామంది హీరోలు బాలీవుడ్ లో అడుగుపెట్టారు. రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలు బాలీవుడ్ లో సినిమాలు చేశారు. మరి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ఎవ్వరూ రారా? హిందీ హీరోలు తెలుగులో సినిమాలు చేయరా? ఇప్పుడీ ప్రశ్నకు సమాధానంగా నిలిచాడు రణబీర్ కపూర్. అవును.. తన నెక్ట్స్ సినిమాను రణబీర్ కపూర్ తెలుగులో కూడా తీస్తున్నాడు. అదే యానిమల్.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తోంది యానిమల్. నిన్ననే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హిమాలయాల్లో మొదలైంది. ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే తీయడం లేదు. హిందీతో పాటు తెలుగులో కూడా తీస్తున్నారు. అలా యానిమల్ మూవీతో రణబీర్ కపూర్, టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు.
ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులో తీయడానికి ఓ కారణం ఉంది. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. అతడి క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రష్మికకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. అందుకే ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని, యానిమల్ ను తెలుగులో కూడా తీస్తున్నారు.
అయితే రణబీర్ మాత్రం తెలుగులో డబ్బింగ్ చెప్పడం లేదు. అతడి పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించబోతున్నారు. టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో, యానిమల్ లో రణబీర్ కు డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఆ స్టార్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు.