సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటే, వాళ్లకు వచ్చే బహుమతులు కూడా అదే రేంజ్ లో చాలా ఖరీదుగా ఉంటాయి. మొన్నటికిమొన్న విక్కీ కౌసల్, కత్రినాకైఫ్ పెళ్లి చేసుకుంటే.. సల్మాన్, షారూక్ లాంటి నటులు ఖరీదైన బహుమతులు అందించారు. ఇప్పుడు అలియాభట్, రణబీర్ కపూర్ వంతు వచ్చింది. మరి వీళ్ల పెళ్లికి వచ్చిన ఖరీదైన బహుమతి ఏంటి?
తమ పెళ్లికి బాలీవుడ్ సెలబ్రిటీల్ని ఆహ్వానించలేదు రణబీర్-అలియా. కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ ఖరీదైన బహుమతి అందుకున్నాడు రణబీర్. తన కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, రణబీర్ కు అత్యంత ఖరీదైన రిస్ట్ బ్యాండ్ ను బహుమతిగా అందించాడు. దీని ఖరీదు అటుఇటుగా 4 కోట్ల రూపాయలు.
ప్రత్యేకంగా రణబీర్ కోసం ఆ బంధువు, ఈ రిస్ట్ బ్యాండ్ ను తయారుచేయించాడు. బంగారం, ప్లాటినమ్ మిక్స్ చేసి తయారుచేసిన ఈ బ్యాండ్ లో ఖరీదైన వజ్రాలతో పాటు.. రణబీర్ కపూర్ జాతకానికి తగ్గట్టు సూటయ్యే ఖరీదైన రంగురాళ్లను కూడా పొదిగాడు అతడు. ఈ గిఫ్ట్ చూసి రణబీర్ షాక్ అయ్యాడట.
ఇక ఈ బహుమతి తర్వాత రెండో స్థానంలో నిలిచిన గిఫ్ట్ మరో రిస్ట్ బ్యాండ్. ఈ బ్యాండ్ ను రణబీర్ కపూర్, అలియాకు బహుకరించాడు. మెహందీ ఫంక్షన్ లో వేసుకోవడం కోసం అలియాకు బహుకరించిన ఈ గిఫ్ట్ రేటు అటుఇటుగా కోటిన్నర రూపాయలంట. అయితే ఓవరాల్ గా చూసుకుంటే.. కత్రినా పెళ్లితో పోలిస్తే, అలియా పెళ్లికి వచ్చిన బహుమతులు చాలా తక్కువ.