యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రంగ్ దే. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మొదట డిజిటల్ రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ, థియేటర్లకు సర్కార్ అనుమతి ఇవ్వటంతో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు సంక్రాంతి బరిలో సినిమా ఉంటుందని అంతా భావించారు. కానీ 100శాతం ఆక్యుపెన్సీ వచ్చే వరకు సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వచ్చే వేసవి వరకు థియేటర్లలో 100శాతం ఆక్సుపెన్సీ ఇచ్చే అవకాశం ఉండటం, కరోనా పరిస్థితులు కాస్త కుదుటపడే అవకాశం ఉండటంతో వేసవికి సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 26న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.