ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రంగమార్తాండ. మరాఠి లో సూపర్ డూపర్ హిట్ సాధించిన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్ వెర్షన్ లో నానాపటేకర్ క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి రెండేళ్లు అవుతోంది.
Advertisements
ఇక మధ్యలో నిర్మాత తప్పుకోవడంతో సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది అంటూ వార్తలు రాగా… ఆ వార్తలకు చెక్ పెడుతూ దర్శకుడు కృష్ణవంశీ ఓ ట్వీట్ చేశారు. రంగమార్తాండ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది.. అంటూ షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.