హీరోహీరోయిన్లు ఇద్దరికీ ఇగో ఉంటుంది. ఆ ఇగో వెనుక ప్రేమ కూడా ఉంటుంది. ఆ ఇగోల్ని దాటి ఇద్దరూ ఎలా కలిశారనేది సినిమా స్టోరీ. ఈ లైన్ వినగానే ఎవ్వరికైనా ఖుషీ సినిమా గుర్తొస్తుంది. అయితే.. ఇక్కడ మేటర్ ఖుషి గురించి కాదు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగరంగ వైభవంగా సినిమా గురించి. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజైంది. అందులో మెయిన్ పాయింట్ ఇగోలే.
హీరీ హీరోయిన్లు ఇద్దరూ ఒకే కాలేజీ లో చదువుతుంటారు. హీరోయిన్ అంటే హీరోకు ఇష్టం. హీరో అంటే హీరోయిన్ కు కూడా ప్రేమ. కానీ.. ఇద్దరూ మాట్లాడుకోరు. దీనికి కారణం ఇగో. అసలు ఇద్దరి మధ్య ఇంత ఇగో ఎందుకొచ్చింది? దీనివల్ల వాళ్ల కుటుంబాలు ఎలా డిస్టర్బ్ అయ్యాయి.. ఫైనల్ గా ఇద్దరూ కలిశారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ.
టీజర్ లో మెయిన్ పాయింట్ చెప్పేశాడు దర్శకుడు గిరీశాయ. హీరోహీరోయిన్ల పాత్రల్ని చాలా క్యూట్ గా చూపించాడు. వైష్ణవ్-కేతిక పెయిర్ చాలా బాగుంది. ఇక శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఈ ఫీల్ గుడ్ మూవీలో నవీన్ చంద్ర ఓ కీలక పాత్ర పోషించాడు. అయితే టీజర్ లో అతడికి చోటు దక్కలేదు.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను జులైలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై అటు కేతిక, ఇటు వైష్ణవ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, కేతికకు ఇప్పటివరకు సక్సెస్ రాలేదు. అటు వైష్ణవ్ కొండపొలంతో ఫ్లాప్ అందుకున్నాడు.