రంగస్థలం సినిమాలో అందరికీ గుర్తుండిపోయే గ్లామరస్ పాత్ర రంగమత్త…. అగరా బాబు మా ఆయన అసలే దుబాయ్ లో ఉన్నాడంటూ కవ్వించే పాత్ర రంగమత్తది! మోకాళ్లకు పై వరకు చీర కట్టి…. అచ్చమైన పల్లెటూరు యాసలో హొయలొలికించే పాత్ర అది! అనసూయ ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేసింది.
అయితే రంగస్థలం టీమ్ మాత్రం…. రంగమత్త పాత్ర కోసం మొదటగా హీరోయిన్ రాశిని సంప్రదించారట., కానీ మోకాళ్ల పై వరకు చీరలో నటించడానికి రాశీ నో చెప్పిందట…దీంతో ఆ పాత్ర అనసూయకు దక్కింది.
రాశి కెరీర్స్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. జగపతి బాబుతో శుభాకాంక్షలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి….పవన్ కళ్యాణ్, శ్రీకాంత్ ,బాలకృష్ణ , వడ్డే నవీన్ ల సరసన హీరోయిన్ గా నటించింది.