5 ఏళ్ల పాపను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైబరాబాద్ పరిధిలో జరిగిన ఈ ఉదాంతంలో నిందితుడు దినేష్ కు మరణశిక్ష విధించింది.
2017 నార్సింగ్ లో ఈ ఘటన జరిగింది. పాపను లేబర్ క్యాంపుల్లో కి తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత కిరాతకంగా హత్య చేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ట్రైల్ నిర్వహించిన పోలీసులు… నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించటంతో కోర్టు మరణశిక్షను విధించింది.