జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నటుడు మహేష్. వచ్చిన అవకాశాల్లో తన నటనతో మెప్పించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా మహేష్ ఓ ఇంటివాడు అయ్యాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నాడు. న మే 14వ తేదీన ఉదయం. 6.31 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామంలో వధువు ఇంటి వద్ద కొద్ది మంది బంధువుల సమక్షంలో పావనిని వివాహం చేసుకున్నాడు. శతమానం భవతి, రంగస్థలం, గుణ 369, ప్రతిరోజు పండగే చిత్రాల్లో మహేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.