గ్రాండ్ గా 'రంగస్థలం' ప్రీ-రిలీజ్ ఈవెంట్

రాంచరణ్, సమంతల ” రంగస్థలం-1985 ” మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మార్చి 18..ఉగాది పండుగనాడు వైజాగ్ లో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. చరణ్ అభిమానుల కేరింతల మధ్య ఇది జరుగుతుందని ఈ చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే ఆడియో రిలీజ్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్స్ వేసి కీలక సన్నివేశాలను షూట్ చేశారు. గోదావరి ఒడ్డున చరణ్, సమ్మూల పై పలు సీన్స్ చిత్రీకరించారు. చిట్టిబాబుగా చెర్రీ, ఫక్తు పల్లెటూరి అమ్మాయిగా సమంత ఇందులో విభిన్న పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. మార్చి 30 న ఈ చిత్రం విడుదల కానుంది.