కరోనా…. ఇప్పుడు ఈ వైరస్ అన్ని దేశాలను భయపడుతోంది. ఎక్కడ చుసిన కరోనాపైనే చర్చ నడుస్తుందంటే.. దీని విస్తృతి ఎంత వేగంగా, ఎంత భయంకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చైనాలో జన్మించిన ఈ ప్రాణాంతక వైరస్ తాజాగా 20దేశాలకు వ్యాప్తి చెంది ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తోంది. చైనాలో ఈ వైరస్ బారిన పడి 400మందికి పైగా మృతి చెందారు. ఈ వైరస్ భూతం మన దేశంలోకి కేరళ నుంచి ఎంటరైంది. అక్కడ ముగ్గురికి ఈ వైరస్ సోకింది. వీరు ఇటీవల చైనాలో పర్యటించినట్లు తెలుస్తోంది. కేరళలోకి ఈ వైరస్ ప్రవేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ .. మరికొంతమందికి సోకకుండా కేరళ అలర్ట్ అయింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. ఈ వైరస్ ఓ హీరోయిన్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బోజ్ పురి హీరోయిన్ రాణీ ఛటర్జీ తీవ్ర అనారోగ్యంతో సతమతం అవుతోంది. ఆమె తన సోషల్ మీడియాలో .. ‘గత10 రోజులుగా జలుబు, జ్వరం, తలనొప్పి, మైగ్రేన్‌తో బాధపడుతున్నానని పేర్కొంటూనే.. కరోనా వైరస్ లక్షణాలు ఎదుర్కొంటున్నానేమోనని సందేహం వ్యక్తం చేసింది.