అక్కడ ‘పరుగు’ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయ్. హీరోయిన్ షీలాకి ఒక ఫ్రెండు లాంటి పనిమనిషి కావాలి. సినిమా పరంగా ఆ క్యారెక్టర్ పేరు తులసి. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చాలా మందిని ఆడిషన్ చేసారు. ఎవరూ సెట్ కాలేదు.
ఒక అమ్మాయి తులసి పాత్రకు అతికినట్టు సరిపోయింది. సినిమా రిలీజైంది. సినిమాతోపాటు హీరోయిన్, పనిమనిషి తులసి ట్రాక్ కూడా హిట్ అయ్యింది. ఆమె ఎవరో ఇప్పుడు మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఆమె పేరు రాణి అలియాస్ చిత్రలేఖ.యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన చిత్రలేఖ అంతగా సక్సెస్ కాలేదు. అయితే ‘పరుగు’ తనకి మంచి బ్రేక్ ఇచ్చింది.
కానీ పెద్దగా సినిమాల్లో కంటిన్యూ కాలేదు.. పెళ్ళికావడం, బిడ్డ పుట్టడంతో కొంత గ్యాప్ తీసుకుని ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. షోలు, ఈవెంట్లతో..బిజీ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పర్సనల్, ప్రొఫెషల్ అప్ డేట్స్, లేటెస్ట్ ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.