హైదరాబాద్ నగర శివారులోని విలువైన భూములన్నిమెగా కృష్ణారెడ్డి, రామేశ్వరరావులకే కారు చౌకగా కట్టబెడుతున్నారని ఆరోపించారు యువ తెలంగాణ నాయకురాలు, జర్నలిస్ట్ రాణిరుద్రమ. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కుంభకోణం జరిగిందని… అక్కడా మెగా కృష్ణారెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. ఇక కేసీఆర్ ఎవరినీ కలవరని… ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు ప్రొ.నాగేశ్వర్ ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వలేదని, కానీ మెగా కృష్ణారెడ్డి, రామేశ్వరరావులను మాత్రం రోజు కలుస్తారని ఆరోపించారు. ఇక పాలమూరు రంగారెడ్డి అంచనాలు ఎవరికోసం పెంచారో అంటూ సూటిగా విమర్శలు చేశారు.
రాణి రుద్రమ… జాగో తెలంగాణ కార్యక్రమంలో అసలేం మాట్లాడారంటే…