తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి, ప్రియుడితో పారిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రాణిగంజ్ కి చెందిన యువతి వృత్తి రీత్యా ఓ ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తుంది. ప్రతిరోజు తన చెల్లెల్లతో ఎంఎంటీఎస్ ట్రైన్ లో విధులకు వెళ్తుంటుంది. రోజులానే చెల్లెల్లతో వెళ్లిన యువతి ఒక లేఖను ఇచ్చి ట్రైన్ దిగిపోయింది. ఆ లేఖ లో అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను చనిపోతున్నానంటూ రాసిపెట్టింది.
అమెరికా లో హైదరాబాద్ యువతి మృతి
జబర్ధస్త్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
ఇక్కడే ఆ యువతి తన తెలివిని ప్రదర్శించింది. నెక్లెస్ రోడ్ లో తన బ్యాగ్ ని విడిచిపెట్టివెళ్లిపోయింది. అది చూసిన పోలీసులు యువతి నీళ్లలో దూకింది అనుకుని గాలించారు. గజ ఈతగాళ్లను తెప్పించి నాలాలో గాలింపులు చేశారు. ఎక్కడ ఆచూకీ దొరకలేదు . సోమవారం ఉదయం 10 గంటలకు ఎంఎంటీఎస్ ట్రైన్లో బయలుదేరిన యువతి సాయంత్రం ఆరు గంటలకు ఫోన్ చేసింది. తాను ప్రేమించిన అబ్బాయి తో వెళ్ళిపోతున్నానని చెప్పింది. అప్పటివరకు తన కూతురు చనిపోయింది అనుకున్న తల్లితండ్రులు దైర్యం తెచ్చుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.