సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగయ్ దంపతులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వి ఐ పి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ముందుగా ఆలయ మహాద్వారం ముందు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో స్వామివారి విశేష వస్త్రంతో సత్కరించారు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు.