ముంబై : ఈ వృద్దురాలి పేరు రేణు మండల్.. వికారంగా ఉందని సొంత కూతురే బయటికి గెంటేసింది. దాంతో ఏడేళ్లుగా రైల్వే ప్లాట్‌ఫాంపైనే వుంటోంది. అండగా ఎవరూ లేకపోయినా.. దేవుడిచ్చిన అద్భుతమైన స్వరంతో పాటలు పాడుతూ భిక్షాటన చేస్తూ బతుకీడుస్తోంది. ఒక యువకుడు ఆమె పాట వీడియో చేసి సోషల్ మీడియాలో ఉంచాడు. అది అలా అలా వైరల్ కావడంతో.. సోనీ ఛానెల్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. సోనీ పిలుపుతో రాత్రి రాత్రికి ఆమె స్టార్ అయిపోయింది. ఏ కూతురైతే తల్లి ముసలిదైందని ఇంట్లో నుంచి గెంటేసిందో ఆ కూతురే వచ్చి ముఖాన నవ్వు పులుముకోని తల్లిని హత్తుకుంది.
ఆమె పాట మీకూ వినాలని వుందా… ఐతే, ఈ లింకు ఫాలో అవ్వండి..