రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 25న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ పై రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ లైవ్ సెషన్‌లో రణ్‌వీర్ మాట్లాడుతూ రామ్ చరణ్‌ను మృగం,సంపూర్ణ యంత్రం అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా నాటు నాటు పాట కూడా పాడారు.
మగధీర సినిమా చూసినప్పటి నుంచి రామ్‌చరణ్ చేసిన పనిని తాను ఎంతగానో ఆరాధిస్తానని అన్నారు. హైదరాబాద్‌లో నాకు ఇష్టమైన నటులలో అతను ఒకడని చెప్పుకొచ్చారు.
ఇక గతంలో శంకర్ చరణ్ సినిమాల ఓపెనింగ్ కు సెప్టెంబర్‌లో రణ్‌వీర్ సింగ్ కూడా ముంబై నుండి వచ్చారు. అప్పుడు ఈ ఇద్దరు దిగిన ఫోటోలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
“#RamCharan is an absolute Beast & Absolute maychine. One of my Favourite Actors from Hyderabad. I loved him ever since i saw Magadheera and im so excited for #RRRMovie.” – @RanveerOfficial@AlwaysRamCharan #RC15 pic.twitter.com/NRyBxYFzKb https://t.co/yP6onkELUc
— MEGASTAR CHIRANJEEVI (@ChiruIdealActor) February 11, 2022