బాలీవుడ్ బెస్ట్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణెలు యూఎస్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ సంగీత కార్యక్రమానికి అటెండ్ అయిన ఆ ఇద్దరు స్టెప్పులు వేస్తూ ఫుల్ జోష్ లో కనిపించారు.
వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ జంట స్టెప్పులను చూసి అభిమానులు తెగ సంబుర పడిపోతున్నారు.
ఓ వీడియోలో ‘దిల్ చాహతాహై’ మూవీలోని హిట్ సాంగ్ ‘ కోయి కహే కెహతా రహే’కు వారిద్దరూ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కనిపిస్తున్నారు.
వారి పక్కనే దీపికా పదుకొణే తల్లిదండ్రులు ప్రకాశ్ పదుకొణే, ఉజ్జల్ పదుకొణే, సోదరి అనిషా పదుకొణేలు ఉండటం గమనార్హం. ఈ నెల 6తో రణవీర్ 36వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.
ఈ క్రమంలో రణవీర్ కు శంకర్ మహాదేవన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. రణవీర్ బర్త్ డే సందర్భంగా ఓ ప్రత్యేకమైన బర్త్ డే సాంగ్ ను శంకర్ మహదేవన్ ఆలపించారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా రణవీర్ కు బర్త్ డే విష్ చేశారు.