యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛపాక్. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో నటించిన దీపికపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విమర్శకులను సైతం తన నటనతో మెప్పించిన దీపికకు తన భర్త రణవీర్ భావోద్వేగంతో రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. రణవీర్ తల్లితండ్రులు, దీపిక తల్లితండ్రులతో కలిసి సినిమా చూసి… దీపికకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ లేఖను రాశాడు.
మై బేబీ… నువ్వు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డావో చెప్పడానికే నేనే ప్రత్యక్ష సాక్షిని. ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఓ యంత్రంలా పనిచేశావు. ఛపాక్ అనే సినిమాకు నువ్వే ఆత్మ. నీ సినిమా కెరీర్ మొత్తంలో ఇది అత్యంత ప్రాముఖ్యత ఉన్న చిత్రం. నువ్వు, నీ టీం భయాలను, సమస్యలను అధిగమించి… పరిస్థితులతో పోరాడి కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. నేను ఊహించిన దాని కన్నా అద్భుతంగా నటించిన నన్ను కదిలించావు. నీ నటన చూసి నేను ఆశ్చర్యపోయానను. బలహీనతలకు బలాన్ని జోడించి మాల్తి పాత్రకు గౌరవాన్ని తెచ్చావు. నేను నీ కంటే గొప్పవాడిని అని ఎప్పుడు గర్వించలేదు ఐ లవ్ యూ బేబీ అంటూ ముగించాడు.
Advertisements
ఇక సినిమా యూనిట్ గురించి మాట్లాడుతూ… మేఘనా, మీ చిత్రం ప్రేక్షకుల్లో జీవితంపై ఆశను, ధైర్యాన్ని నింపుతుంది. సినిమా ద్వారా మంచి, చెడుల మధ్య రంగులు మారే మనిషి మానవత్వాన్ని చూపించారు. రాజి, తల్వార్‌ల తర్వాత ఛపాక్ ఉంటుంది అంటూ అభినందించాడు.