పుష్ప-2 సినిమాకు సంబంధించి క్రేజీ రూమర్ బయటకొచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటిస్తున్నాడట. ప్రస్తుతం ఈ మేటర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బన్నీ-రణవీర్ సింగ్ కాంబో అంటే మామూలుగా ఉండదు. వీళ్లిద్దరిదీ క్రేజీ కాంబో అవుతుంది.
పుష్ప-2లో బన్నీ ఇంట్రక్షన్ ఇచ్చే క్యారెక్టర్ ఒకటి ఉందట. అది కూడా చాలా కిరాక్ గా, పవర్ ఫుల్ గా ఉండే పోలీసాఫీసర్ పాత్ర అంట. ఆ రోల్ కోసం రణవీర్ సింగ్ ను తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే గనుక జరిగితే ఈ పాన్ ఇండియా సినిమా కాస్తా, పాన్ వరల్డ్ సినిమాగా మారడం ఖాయం.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది పుష్ప-2 సినిమా. తాజాగా ఫహాజ్ పై ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. త్వరలోనే బన్నీ, రష్మికపై మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అంతలోనే ఈ ఊహాగానం చెలరేగింది. దీనిపై యూనిట్ స్పందించలేదు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు నిర్మాతలు. పుష్ప పార్ట్-1 పెద్ద హిట్టవ్వడంతో, పార్ట్-2 కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు.