రావు పద్మ,
హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు.
హన్మకొండలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నాయకుల కబ్జా భూములే. కేటీఆర్ వరంగల్ వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలను అరెస్ట్ లు చేస్తారు. వరంగల్ స్మార్ట్ సిటీ కింద 2500 కోట్ల నిధులు వస్తే మీరు చేసిన అభివృద్ధి ఏంటి?.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే భద్రకాళి బండ్, నేషనల్ హైవేస్ అభివృద్ధి జరిగింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటి వరకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థలాన్ని కేటాయించలేదు. వరంగల్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు కేటీఆర్ ఏం భరోసా ఇచ్చాడు?.
నెలలో రెండుసార్లు నగరానికి వస్తాడు. కానీ చేసేది మాత్రం శూన్యం. కేసీఆర్ కుటుంబానికి కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిలో లేదు. మొక్కల నర్సరీ కాంట్రాక్టులో 20 కోట్ల స్కాం నిజం కాదా?.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసింది కేటీఆర్. లిక్కర్ స్కాం చేసింది కవిత. స్కామర్స్ ఉంది కేసీఆర్ కుటుంబంలో. కానీ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో అన్యాయంగా బండి సంజయ్ ని ఇరికించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం.