రావు రమేష్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. రావు గోపాలరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా సొంత ప్రతిభతో నిలదొక్కుకున్నాడు. గమ్యం, కొత్త బంగారులోకం సినిమాలతో మంచి నటుడిగా నిరూపించుకున్న ఆయన… అదే టెంపోనూ కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కే ఏ సినిమాలో అయినా ఆయనకు ఓ క్యారెక్టర్ ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అంత క్రేజ్ ఉంది కాబట్టే.. తాజాగా ఆయన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.
రావు రమేష్ అప్ కమింగ్ మూవీ కోసం కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న నాయట్టు రీమేక్‌లో కీలక పాత్రకు ఎంపికైన ఆయన.. ఈ పారితోషికం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కాల్షిట్లు ఎక్కువ ఇవ్వాల్సి ఉండటం కారణంగానే ఆంత తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నా.. సినిమాపరంగా ఇది పెద్ద మొత్తమేనని అనుకుంటున్నారు.