దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ తరువాత కూడా దేశంలో మహిళ పై అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గలేదు. ప్రతి క్షణం ఏదో ఒక గోరం చోటుచేసుకునే ఉంటుంది. తాజాగా ప్రియుడితో సరదాగా బయటకు వెళ్లిన అమ్మాయి పై ఆరుగురు యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ ఆరుగురి చర నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే సీరనాయగన్నాళయానికి చెందిన యువతి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. మార్గమధ్యంలో ఆరుగురు యువకులు అడ్డగించి ప్రియుడిని చితకబాది యువతిని ఎత్తుకుపోయి సామూహిక అత్యాచారం చేసి వదిలేశారు.
ప్రాణాలతో బయటపడ్డ యువతి ఇంటికి చేరుకుని తల్లితండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం అదే ప్రాంతానికి చెందిన మణికంఠన్ , కార్తీ , రాహుల్, ప్రకాష్, కార్తీకేయన్, నారాయణమూర్తి లను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో హాజరుపరచి కోర్టు ఆదేశాలమేరకు రిమాండ్ కు తరలించారు.