మైనర్ బాలికపై రేప్ చేసేందుకు ప్రయత్నించిన ఓ నిందితుడికి ప్రజలు దేహశుద్ధి చేసి నగ్నంగా ఊరేగించారు. కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ లో కలెక్షన్ బోయ్ గా పనిచేసే యువకుడు మనీ కలెక్షన్ కోసం రోజూ బాధిత బాలిక ఇంటికి వెళ్తుంటాడు. రోజు మాదిరిగానే యువకుడు వెళ్లినప్పుడు బాధిత బాలిక తప్ప ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ఆ యువకుడు బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అదే సమయంలో బయటకు నుంచి వచ్చిన ఆ అమ్మాయి తల్లి పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లంతా వచ్చి ఆ యువకుడిని చితగ్గొట్టారు. చేతులను తాళ్లతో కట్టేసి నగ్నంగా ఊరేగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర నాగ్ పూర్ లోని పార్ధి ఏరియాలో ఈ సంఘటన జరిగింది.