నిర్భయ..దిశ ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఓ కేసులో నిందితులకు ఉరి శిక్ష అమలైతే.. మరో కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. అయినా ఆడవాళ్లపైన అఘాయిత్యాలు ఆగడంలేదు. రోజుకో చోట అంతకన్నా ఘోరమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. విశ్వనగరి భాగ్యనగరిలో ఇప్పుడు మరో ఘటన జరిగింది. బస్సులో ప్రయానిస్తున్నా మహిళతో మాటామాటా కలిపి ఓ డ్రైవర్ బస్సులోనే అఘాయిత్యానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. సొంతూరు వెళ్లేందుకు వచ్చిన మహిళను నమ్మకంగా బస్సు ఎక్కించుకున్న డ్రైవర్ నీచానికి పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహిళ హైదరాబాద్ లో బేబీ కేర్ టేకర్ గా పనిచేస్తుంది. ఇద్దరు పిల్లలతో కలిసి మాదాపూర్ లో నివసిస్తోంది. సొంతూరు వెళ్లేందుకు ఈ నెల 23న కూకట్ పల్లిలో ప్రైవేటు స్లీపర్ బస్సు ఎక్కింది.
తనకు కేటాయించిన చివరి సీటులో మహిళ నిద్రపోతుండగా అర్ధరాత్రి 12.30 గంటలు దాటిన తర్వాత.. బస్సును మరో డ్రైవర్ నడుపుతుండగా.. రాజేష్ అనే ఇంకో డ్రైవర్ నీచానికి వడికట్టాడు. ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. అంతేకాదు.. బస్సు దిగే సమయంలో ఆమె వద్ద ఉన్న రూ. 7 వేలను కూడా డ్రైవర్ లాక్కున్నాడని ఆమె ఆరోపిస్తోంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బస్సులో మిగతా ప్రయాణికులు లేరా..? ఆమె అరుపులు కేకలు వేస్తే వారు హెల్ప్ చేసేవారు కదా..? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. అయినా సదరు మహిళ అలా చేయకపోవడానికి కారణం ఏంటీ అనే అనుమానాన్ని వ్యాక్తం చేస్తున్నారు.