తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగా గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. మాయమాటలు చెప్పి బాలికపై పొన్నగారి లక్ష్మణ్ అత్యాచారం చేసి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిన తతంగాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు. దిశ ఘటన అనంతరం మార్పు వస్తుందని భావించినప్పటికీ కామాంధులు మాత్రం బరితెగిస్తూనే ఉన్నారు.