కేరళ అసెంబ్లీ ఎన్నికలు చిత్ర విచిత్రమైన ఘటనలకే కాదు. సంచలన నిర్ణయాలకు వేదికవుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పినరయ్ విజయ్‌కు పోటీగా వలయార్ అత్యాచార బాధితురాళ్ల తల్లి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది
.
మూడేళ్ల క్రితం (2017) వలయార్ ప్రాంతానికి చెందిన అక్కాచెళ్లెల్లపై కొందరు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హతమార్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని స్థానిక కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. దీంతో తీవ్ర దుమారం రేగింది. ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడంతో కేరళ ప్రభుత్వం స్థానిక హైకోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. కానీ ఇంతవరకూ ఆ కేసు తేలలేదు. అప్పటి నుంచి తన కూతుళ్ల మరణానికి కారణమైన వారిపై.. వారి తల్లి పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా ముఖ్యమంత్రి పినరయ్‌పై పోటీకి దిగుతోంది.
తన కుటుంబానికి అంత అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి పినరయ్ కనీసం పట్టించుకోలేదని, ఒక్క మాట కూడా మాట్లాడలేదని బాధితురాళ్ల తల్లి ఆరోపిస్తున్నారు. సీఎంను నిలదీసేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు. కాగా ధర్మదాంలో ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్.. ఈమెకే మద్దతివ్వాలని భావిస్తోంది.