టాలీవుడ్ యంగ్ హీరో రామ్ తో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల రొమాన్స్ చేయబోతుంది. రామ్, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సస్పెన్స్ కు తెరదించుతూ దసరా పండుగ సందర్భంగా హీరోయిన్ ఎవరనేది చెప్పారు.
పెళ్లి సందD మూవీ ఫేం శ్రీలీల రామ్‌తో కలిసి రొమాన్స్ చేయబోతుంది. RAPO 20 ప్రాజెక్టులోకి శ్రీలీలకు స్వాగతం అంటూ మేకర్స్ అఫీషియల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 6 నుంచి మొదలు కానున్నట్టు సమాచారం.
ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రంతో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు రామ్.
ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో.. హీరో శ్రీకాంత్ తనుయుడు నటించిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సుందరినే ఇప్పుడు రామ్ 20వ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ మేరకు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. కానీ ‘బోయపాటి ర్యాపో’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది.
Excited to share this good news on this auspicious day.A big thank you to the entire team!!
Wishing #HappyDussehra to you all 🔱#BoyapatiRAPO@ramsayz #BoyapatiSreenu @SS_Screens @srinivasaaoffl https://t.co/HeHL8FZdci— sreeleela (@sreeleela14) October 5, 2022